Header Banner

టెక్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఆలీబాబా! AI మార్కెట్‌లో గేమ్‌చేంజర్!

  Thu Mar 06, 2025 21:41        Technology

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చైనీస్ టెక్ దిగ్గజం అలీబాబా కొత్తగా QwQ-32B అనే AI మోడల్‌ను ఆవిష్కరించింది. 32 బిలియన్ పారామితులతో రూపొందించిన ఈ రీజనింగ్ మోడల్, OpenAI, o1-mini వంటి ప్రముఖ AI మోడళ్లతో పోటీ పడుతుందని కంపెనీ వెల్లడించింది. సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో ఈ మోడల్ అధిక సామర్థ్యాన్ని చూపుతుందని, తక్కువ డేటాతో కూడిన మెరుగైన పనితీరును అందించగలదని పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

QwQ-32B,క్వెన్ 2.5 మోడల్‌పై పనిచేస్తుంది. ఇది మానవులలాంటి ఆలోచనలు, నమూనాలను విశ్లేషించి, సమస్యల పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. టెక్స్ట్, ఇమేజ్, ఆడియో వంటి ఫీచర్లను సపోర్ట్ చేసే ఈ మోడల్, AI రంగంలో కొత్త మార్గాలను ఏర్పరుస్తుందని అంచనా వేస్తున్నారు. DeepAI R1 మోడల్ 671 బిలియన్ పారామితులతో పనిచేస్తుండగా, అలీబాబా తక్కువ పారామితులతో ఎక్కువ వేగవంతమైన పనితీరును అందించగలిగినట్లు ప్రకటించింది. డీప్ లెర్నింగ్, రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL) తదితర విభాగాల్లో ఈ మోడల్ విస్తృతంగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

అలీబాబా ప్రకటన ప్రకారం, QwQ-32B మోడల్ కృత్రిమ సాధారణ మేధస్సు (AGI) అభివృద్ధికి సహాయపడుతుందని నమ్మకంతో రూపొందించబడింది. తక్కువ డేటాతో ఎక్కువ సామర్థ్యాన్ని అందించగలిగేలా దీన్ని అభివృద్ధి చేయడం విశేషం. AI మార్కెట్లో గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ఈ మోడల్ కీలకంగా మారుతుందని కంపెనీ అభిప్రాయపడింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #AlibabaAI #QwQ32B #AIBreakthrough #TechRevolution #ArtificialIntelligence #DeepLearning #GameChanger